Tuesday 20 September 2011

sakala janula samme effect(సకలజనుల సమ్మె ఎఫెక్ట్)

ఎల్లుండునుంచే దసరా సెలవులు పాఠశాలలకు దసరా సెలవులు ఈనెల 22 నుంచే ఇస్తున్నట్లు పాఠశాల సంచాలకులు ప్రకటించారు.ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు:సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు ఆర్టీసీ యజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్: రేపటినుంచి ఉద్యోగాల్లో పాల్గొనే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆర్టీసీ యజమాన్యం ప్రకటించింది.ఆర్టీసీలో ఉద్యోగాలు:ఆర్టీసీలో కండక్టర్లుగా, డ్రైవర్‌లుగా చేరదలచిన అర్హులైన అభ్యర్థులు ఆయా రీజనల్ కార్యాలయాల్లో ఇంటర్వూలకు హాజరు కావాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది.సమ్మె విఛ్చిన్నానికి ఆర్టీసీ కుట్ర:సకలజనుల సమ్మె విచ్ఛిన్నానికి ఆర్టీసీ యాజమాన్యం కుట్ర పన్నుతుందని ఆర్టీసీ తెలంగాణ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి ఆరోపించారు. తొలగించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

No comments:

Post a Comment