Friday 9 September 2011

samme pi sarkaru visham(సమ్మెపై సర్కారు విషం)

- ఉపాధ్యాయులపై ఉక్కుపాదం
- 60 శాతం ఫలితాలు సాధించకపోతే..డిస్‌మిస్ చేయండి.. లేదా తొలగించండి
- 90 శాతం ఫలితాలు సాధిస్తేనే ఉత్తమ ఉపాధ్యాయుడికి సిఫారసు
- 130 జీఓ జారీచేసిన పాఠశాల విద్యాశాఖ
- టీచర్లను భయపెట్టడానికేనని విమర్శలు
- స్వయం సహాయక సంఘాలకూ చెక్
- 15 నుంచి ‘సెర్ప్’ మాసోత్సవాలు
- 50 లక్షల మంది దృష్టి మరల్చే యత్నం
- ఉద్యమానికి దూరంగా ఉంచేందుకు ఎత్తుగడ
- ఐదు రకాల చర్యలకు ప్రభుత్వం ఆదేశం
- 90 శాతం ఫలితాలు సాధిస్తేనే ఉత్తమ ఉపాధ్యాయుడికి సిఫారసు
- ఉపాధ్యాయులను భయపెట్టడానికేనని విమర్శలు

నాలుగున్నర కోట్ల ప్రజల ఏకైక డిమాండైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునేందుకు అఖరిపోరాటంగా రూపుదిద్దుకున్న సకల జనుల సమ్మెపై సీమాంధ్ర సర్కారు విషం చిమ్ముతోంది. పోరాటాన్ని పలుచన చేసేందుకు కుయుక్తులు పన్నుతోంది. తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొంటున్న విద్యార్థులను కట్టడి చేసేందుకు టీచర్ల కాళ్లకు బంధాలు వేస్తోంది. సంస్కరణల మసుగులో ఆత్మరక్షణలో పడేసి అడుగు ముందుకేయకుండా కుట్ర చేస్తోంది. 60 శాతం ఉత్తీర్ణత సాధించకపోతే డిస్‌మిస్, లేదా రిమూవ్ చేయాలని, 90 శాతంపైగా ఫలితాలు సాధిస్తేనే ఉత్తమ ఉపాధ్యాయుడి కోసం సిఫారసు చేయాలని సూచిస్తూ జీఓ తెచ్చింది. ఉద్యమంలో సగభాగమైన తెలంగాణ ఆడబిడ్డలను దూరం చేసేందుకు ఎత్తుగడ వేసింది.

దాదాపు 50 లక్షల మంది ఉన్న ఎస్‌హెచ్‌జీ మహిళలను ఊపిరిసలపనివ్వకుండా ప్రత్యేకంగా మాసోత్సవం నిర్వహించనుంది. గత ఏడాది వరంగల్‌లో కేయూ హాస్టళ్లు మూసివేస్తే స్వయం సహాయక సంఘాలు అండగా నిలిచి, సొంత ఖర్చుతో వండిపెట్టాయి. గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న సర్కారు.. ఈ రెండు వర్గాలను కట్టడిచేయకపోతే ఉద్యమాన్ని అదుపు చేయలేమని భావిస్తోంది. ఈ రెండు కార్యక్షికమాలు మొత్తం రాష్ట్రానికి వర్తించేవైనా సకల జనుల సమ్మెను కట్టడి చేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోందని తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు.

కరీంనగర్, టీన్యూస్ ప్రతినిధి: రాష్ట్ర సర్కారు మూడు లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రతాపం చూపాలని నిర్ణయించుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ జీఓను తీసుకొచ్చి ఉపాధ్యాయులపై ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నిస్తోంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చందనాఖాన్ పేరుతో జీఓనంబర్ 130ని శుక్రవారం జారీచేసింది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠశాలపరంగా 60 శాతం ఫలితాలు సాధించలేకపోయినా, ఉపాధ్యాయుడి పరంగా తనకు సంబంధించిన సబ్జెక్టులో 60 శాతం మార్కులు సాధించలేకపోయినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జీఓలో పేర్కొంది. సంబంధిత ఉపాధ్యాయులపై ఐదు రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను అదేశించింది.

డిస్‌మిస్, రిమూవల్, రివర్షన్, నిర్భంద పదవీ విరమణ, ఇంక్రిమెంట్లలో కోత వంటి ఐదు రకాల చర్యలు చేపట్టాలని పేర్కొంది. క్లాసిఫికేషన్ కంట్రోల్ అండ్ అప్పీల్ (సీసీఏ) నిబంధనలకు అనుగుణంగా పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించింది. ఇక ముందు 90 శాతం ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను మాత్రమే ఉత్తమ టీచర్ల ఎంపికకు సిఫారసు చేయాలని స్పష్టం చేసింది.
సకల జనుల సమ్మెనుంచి మరల్చేందుకే..

పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు, ఉపాధ్యాయులను కేటాయించకుండా సీసీఏ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంపై విమర్శలొస్తున్నాయి. ఇది ఉపాధ్యాయులను భయవూబాంతులకు గురిచేసే జీఓనని, దీనిపై అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. జీఓ రాష్ట్ర వ్యాప్తంగా వర్తించేలా ఉన్నా.. లోతుగా చూస్తే తెలంగాణ ఉద్యమంలో చురుకైనా పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో పాల్గొనకుండా చేసే దురుద్దేశం ఉందన్న విమర్శలున్నాయి. ఉద్యమంలో పాల్గొంటే ఫలితాలు తగ్గి ఉద్యోగాలకు ఎసరు వస్తుందేమోననే భయాన్ని ఉపాధ్యాయుల్లో కల్పించి తెలంగాణ ఉద్యమం నుంచి దృష్టి మరల్చే కుట్ర దీని వెనుక దాగి ఉందని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలి
అన్ని పాఠశాలల్లో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎన్‌సీ) ఎన్నికలు నిర్వహించాలని జీఓ స్పష్టంచేసింది. 2001లో ఎస్‌ఎన్‌సీ ఎన్నికలను అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పాఠశాలల్లో రాజకీయాలు జోరందుకోవడంతో 2005 నుంచి ఎన్నికలు జరగడం లేదు. కేవలం నామినేటడ్ పద్ధతిలో కమిటీలను నియమిస్తూ సాగిస్తున్నారు. ఇకపై ఎన్నికలు నిర్వహించి ఆరుగురు కమిటీ సభ్యులను ఎన్నుకోవాలని సూచించింది. కమిటీ ఎంపికకు చేతులు ఎత్తడం, వాయిస్ ఓటు, రహస్య బ్యాలెట్ ఏదో ఒక పద్ధతిలో ఎంపిక చేయాలని సూచించింది. కమిటీ సమక్షంలో ప్రైమరీ పాఠశాలల్లో 30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 42, ఉన్నత పాఠశాలల్లో 48 మందిని ఎంపికచేయాలని సూచించింది. ప్రతి కమిటీలోనూ ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న వార్డుమెంబర్, లేదా కౌన్సిలర్, కార్పొరేటర్‌ను ఉండాలని సూచించింది. ఈ విధానం వల్ల పాఠశాలల్లో రాజకీయాలు చోటు చేసుకుంటాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

- స్వయం సహాయక సంఘాలకూ చెక్
- 15 నుంచి ‘సెర్ప్’ మాసోత్సవాలు
- నిత్యం మీటింగ్‌లకు వెళ్లనున్న ఆడబిడ్డలు
- 50 లక్షల మంది దృష్టి మరల్చే యత్నం
- ఉద్యమానికి దూరంగా ఉంచేందుకు ఎత్తుగడ

వరంగల్, టీన్యూస్ ప్రతినిధి: తెలంగాణ ఉద్యమం నుంచి మహిళల్ని, ఇందిరా క్రాంతిపథం సిబ్బందిని దూరం చేసేందుకు సర్కారు కొత్త ఎత్తగడ వేసింది. ఉద్యమంలో సగభాగమైన తెలంగాణ ఆడబిడ్డలకు మీటింగుల పేరిట సకల జనుల సమ్మెకు దూరం చేసేందుకు నెలరోజులపాటు కార్యక్షికమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సెర్ప్ నగామీణ పేదరిక నిర్మూలనా పథకం) కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాలు సకల జనుల సమ్మెకు సమాయాత్తమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీయాశీలకమైన ఐకేపీ (డీఆర్‌డీఎ)లోని కాంట్రాక్టు ఉద్యోగులు, మహిళా సంఘాలను సమ్మెలో పాల్గొనకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

పావలా వడ్డీ మదింపు చేస్తామని, బ్యాంకులింకేజీ తదితర అంశాలను బూచీగా చూపి అన్ని రకాల పథకాల ప్రగతిపై గ్రామక్షిగామాన సమీక్ష చేయాలని సెర్ప్ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ప్రత్యేకంగా మాసోత్సవాన్ని నిర్వహించాలని ఈనెల 7న సెర్ప్ సీఈఓ రాజశేఖర్ (ఎల్‌ఆర్ నెంబర్: 987) జారీ చేశారు. దీని ప్రకారం ఈనెల 15 నుంచి వచ్చెనెల 14 దాకా నెలరోజుల పాటు సుదీర్ఘ కార్యాచరణ విధిగా నిర్వహించాలని అందులో పేర్కొన్నారు.

సమరానికి దూరం చేసేందుకే?
సెర్ప్ చేపడుతున్న కార్యక్షికమాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పదిజిల్లాల్లో 20 వేల మంది సీఏ (కమ్యూనిటీ అసిస్టెంట్స్)లు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 9.95లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి నిర్మాణంలో రాష్ర్టవ్యాప్తంగా దాదాపు 1.11 కోట్ల మంది సభ్యులున్నారు. ఇందులో తెలంగాణ పది జిల్లాలో కనీసం 50లక్షల మంది మహిళా సభ్యులు ఉంటారని అంచనా. తెలంగాణ ఉద్యమం నుంచి మహిళాశక్తిని దూరం చేసేందుకే సర్కారు కొత్త ఎత్తుగడ వేసిందని విమర్శలున్నాయి. ఇటీవలే ఓ వీడియో కాన్ఫన్స్‌లో మహిళా సాధికారత, స్వావలంబన, వివిధ పథకాలపై మరింత అవగాహన కల్పించాలంటే కళారూపాల ద్వారా చేయవచ్చని కరీంనగర్‌కు చెందిన జిల్లా సమాఖ్య సిఫారసు చేస్తే... సాక్షాత్తు సీఈవోనే ‘చూడమ్మా..డప్పు చప్పుళ్లు, పాటలు కూడుపెట్టవులే కానీ మేం వేరే ఆలోచిస్తాం’ అంటూ తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశాడనే ఆరోపణలున్నాయి.

ఆయన త్వరలో చేస్తున్నామంటే ఏందో అనుకున్నాం కానీ తీరా మమ్మల్నందరినీ సకల జనుల సమ్మెకు దూరం చేసే కుట్ర చేస్తాడని అనుకోలేదని మహిళా సంఘాలు ప్రతినిధులు వాపోతోన్నారు. గత ఏడాది వరంగల్ జిల్లా మహిళా సమాఖ్య పెద్ద ఎత్తున ‘మహిళా గర్జన’ నిర్వహించింది. కేయూ విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టినపుడు, హాస్టళ్లు మూసివేసినప్పుడు ’బిడ్డా మీరేం భయపడకండి..మీవెంట మేమున్నాం. మేం ఒకపూట పస్తులైనా ఉంటాం..మిమ్మల్ని కాపాడుకుంటాం’అంటూ విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులకు వండిపెట్టారు. ఇవి పునరావృతమైతే ఉద్యమాన్ని అదుపు చేయలేమని భావించిన సర్కారు కొత్తగా మాసోత్సవాలు పెట్టిందనే అభివూపాయాలు వ్యక్తం అవుతోన్నాయి.

నెలరోజులు ఏం చేస్తారు..?
తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రగతికి పది సూత్రాలు, స్త్రీశక్తికి అభ్యున్నతి కోసం సర్కారు ఏం కార్యక్షికమాలు చేపడుతోన్నది? ఏ విధంగా వారు సద్వినియోగం చేసుకుంటున్నదో గ్రామస్థాయిలో సంఘాల వారీగా ప్రచారం, సమీక్షలు చేయాలి. గోడలమీద రాతలు, రికార్డుల పనితీరు, ఆడిట్, ఇంటిటి సర్వేలు, లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, పోషకార విలువలు పాటిస్తోన్నారా?లేదా ఇలా రోజుకో కార్యక్షికమం చొప్పున చేపట్టాలి. బ్యాంకు లింకేజీ, పావలా వడ్డీ తదితర అంశాలపై పరిశీలన చేయాలనేది ఆ మార్గదర్శకా సారాంశం. ఇవన్నీ తమ రోజువారీ కార్యక్షికమాలేనని, కొత్తగా చేయాల్సినవి, తెలుసుకోవలసినవి ఏమీ లేవనేది సిబ్బంది వాదన.

కేవలం సకల జనుల సమ్మె నుంచి దూరం చేసేందుకే సర్కారు కుట్ర చేస్తోందని, తమనే కాదు మొత్తం మహిళల్ని అందులో పాల్గొన కుండా చూసేందుకు వారికి రుణాలిస్తామని, వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికేందుకు సర్కారు వేసిన ఎత్తుగడ అని వారు ఆరోపిస్తోన్నారు. మరోవైపు గతంలో వారోత్సవాలు విరివిగా సాగాయని, ఒకసారి పక్షోత్సవాలు జరిగాయి కానీ ఇలా మాసోత్సవాలు చేయాలనడం ఇదే తొలిసారి అని పేర్కొంటున్నారు. నిజంగా సర్కారుకు పేదలపట్ల ప్రేమే ఉంటే, మహిళా సంఘాలను బలోపేతం చేయాలని, జ్వరాల బారినపడి పిట్టల్లా రాలుతున్న మనుషుల ప్రాణాలు కాపాడేందుకు, ఆరోగ్యమేళాలు, వారోత్సవాలు ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment