Tuesday 30 August 2011

balithanaloddu bathiki sadiddam(బలిదానాలొద్దు..బతికి సాధిద్దాం!)

బలిదానాలొద్దు..బతికి సాధిద్దాం!

రంది పడాల్సిన సమయం కాదిది... రణం చేయాల్సిన తరుణం! తెలంగాణ సాధనకు చోదక శక్తి బేలతనపు చావు కాదు. ఎంతమావూతమూ ఆ అవసరం లేదు. కావలసింది తెగించి చేసే ధీరోదాత్త పోరాటమే! ఈ మహత్తర పోరాటంలో పరాక్షికమ సమరవీరులు మీరు! అగ్రగామి దళాలు మీరు! నెత్తురు మండే శక్తులు నిండే ముందు యుగం దూతలు మీరు! మీరు లేనిదే ఉద్యమం లేదు.. మీరు లేనిదే ఉద్యమం ఉండదు! మీరు లేనిదే తెలంగాణ పోరు లేదు! మీ పోరు లేనిదే ఉజ్వల భావి తెలంగాణ ఊహించనేలేము! తెలంగాణ కోసం ఈ పోరాటం. దగా పడిన తెలంగాణ యాచక స్థాయి నుంచి శాసక స్థాయికి ఎదిగేందుకే ఈ ఆరాటం! ‘ఎట్లొస్తది తెలంగాణ’ అన్నకాణ్నుంచి ‘ఎట్లెట్లరాదు తెలంగాణ’ అని బరిగీసి నిలిచే కాలం ఇది! నాలుగు కోట్ల ఆకాంక్షలు ఓ వైపు.. గుప్పెడు మంది స్వార్థపర శక్తులు మరోవైపు! వాళ్లూ దిక్కుతోచని స్థితికి రాక తప్పదు. అబద్ధాలు పటాపంచలవుతున్నాయి. తెలంగాణను అడ్డుకుంటున్న కపట సమైక్యవాదపు ఆర్థిక ప్రయోజన ముసుగులు తొలగిపోతున్నాయి. వారి వద్ద ఇప్పుడు పటిష్టమైన వాదనలు లేవు.. పేలవమైన అడ్డగోలు వాదనలే ఉన్నాయి.



గట్టి కారణాలులేవు.. ఓటి మోతలే వారి వద్ద మిగిలాయి. మొన్నటికి మొన్న లోక్‌సభలో మూగబోయిన సమైక్యవాదమే ఇందుకు సాక్షి. చెప్పేందుకు మాటల్లేక.. వాదనతో కాక.. బలవంతంగా నోరు మూయించేందుకు సీమాంవూధనేతలు తెగబడటమే ప్రతీక! అవును... శత్రువు ఓడిపోతున్న తరుణమిది! మహత్తర తెలంగాణ ఉద్యమ చైతన్యం ముందు క్రమక్షికమంగా మోకరిల్లుతున్న సమయమిది! వారిది ఆరిపోయే ముందటి వెలుగు! ఉదయమెంతో లేదు దూరము.. తొలగిపోవునంధకారము..!! కలత వద్దు.. విజయం మనదే! ఈ దశలో మరణం అస్త్రసన్యాసమే! ఈ దశలో అస్త్ర సన్యాసం ఓటమిని ఒప్పుకోవడమే! ఈ దశలో ఓటమిని ఒప్పుకోవడం తెలంగాణను ఒద్దనుకోవడమే! వద్దు.. ఓటమిని ఒప్పుకోవద్దు. పోరు దారి పూల బాట కాదు.. కష్టాల్ నష్టాల్ శాపాల్ రానీ.. ఎదుర్కొందాం. తిప్పి కొడదాం. నిజమే బలిదానం శంకించదగింది కాదు.



పైగా వెల లేనిదే! కానీ.. బతికుండి చేసే పోరాటం మరింత విలువైనది.. వ్యక్తిని శక్తిని చేసేది! బలిదాన స్ఫూర్తి తెలంగాణకు కొదవలేదు. 600 మందికి పైగా అమరవీరులు ఉద్యమాన్ని నిత్యజ్వలితం చేస్తున్నారు! ఆ సెగల పొగలు కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కానీ.. ఆత్మత్యాగం కానే కాదు మార్గం. వీధుల్లో పోరాటాలు నడుస్తున్నాయి. అదే మనదారి. ఇక చావులు వద్దు. ఎవరూ చావొద్దు. ఇప్పుడు ఉద్యమానికి కావాల్సింది ఆత్మహత్యలు కాదు.. ఆత్మబలంతో కొట్లాడే సైన్యం! మీరు చనిపోవడం కాదు.. తెలంగాణలో ఉద్యమం చనిపోకుండా చూడండి! ప్రాణాలు వదలొద్దు.. పోరాటం వదలొద్దు. భావితరం దూతలు. ప్రపంచాన్ని నవ యవ్వన తేజంతో వెలిగించే దివ్వెలు మీరే. తెలంగాణ మీ కోసమే. నెత్తురు మండే శక్తులు నిండే మీలాంటి వాళ్లకోసమే. తెలంగాణ మీది.



సాధించాల్సింది తెలంగాణను. కలెబడుదాం. కొట్లాడుదాం. మన వెంట న్యాయం ధర్మం, రాజ్యాంగ బలం ఉన్నాయి. నీతి నియమాలు, విలువలు తెలంగాణ ఉద్యమంతో ఉన్నాయి. అంతిమంగా న్యాయం గెలుస్తుంది. తెలంగాణ రాక తప్పదు. ప్రపంచంలో ఏ శక్తీ దాన్ని నిలువరించలేదు. పోరాడుదాం.. పోరాడుదాం.. తెలంగాణ వచ్చేదాకా.. బతికి సాధిద్దాం....



.... యావత్ తెలంగాణ యువ సైన్యానికి

నమస్తే తెలంగాణ చేతుపూత్తి చేస్తున్న విజ్ఞప్తి ఇది!

బలిదానాలు వద్దు. పోరాడి తెలంగాణ తెచ్చుకుందాం.







‘‘తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా నాకు సోదర సమానమైన యువతను నేను వేడుకొంటున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోవద్దు. తెలంగాణ ఆకాంక్ష సాకారమయ్యేరోజును చూడటానికి బతికి ఉండండి. ఆత్మహత్యలు చేసుకోవడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి నష్టం చేయకండి. మరొక్క ఆత్మహత్య జరిగినా.. నేను తెలంగాణ ఉద్యమం నుంచి ఉపసంహరించుకుంటాను’’

- ట్విటర్‌లో సుష్మాస్వరాజ్ సందేశం

No comments:

Post a Comment