Wednesday 27 July 2011

14f tholaginchina tharvathane si ratha pariksalu nirvahinchali:kcr

రాష్ట్రపతి నిబంధనలోని 14 ఎఫ్ తొలగించిన తర్వాతే ఎస్.ఐ. రాత పరీక్షలు నిర్వహించాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు డిమాండ్ చేశారు. ఎస్ఐ రాత పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూర్ఖంగా మాట్లాడుతున్నారని, అలా అయితే రాష్ట్రంలో జరిగే పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుదని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కేంద్రం మెడపై కత్తి పెడితేనే ప్రత్యేక తెలంగాణ వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ నేతల మధ్య ఈరోజు నెలకొన్న ఐక్యతను ఇలాగే నిలుపుకుందామని అన్నారు. రాజీనామాలు చేసిన నేతలు ఎక్కడ పోటీ చేసినా ప్రజలు గెలిపిస్తారని, రాజీనామలు చేయనివారిని ప్రజలు గెంటివేస్తారని అన్నారు. ప్రజాప్రతినిధులు చేసిన రాజీనామాలపై అనుమానం ఉంటే స్పీకర్ పిలిచి మాట్లాడాలి, అలా కాకుండా రాజీనామాలు భావోద్రేకంతో చేశారని, తిరస్కరిస్తూ, ఏక పక్ష నిర్ణయం తీసుకుని లండన్ పర్యటనకు వెళ్ళడం ఎంతవరకు సబబని కేసీఆర్ ప్రశ్నించారు.

రాజీనామాలు చేయడం ఎమ్మెల్యేల హక్కు, వాటిని కదనడం రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్ అన్నారు. రాజీనామాలు ఆమోదించకపోవడం వెనుక కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment