Wednesday 27 July 2011

raginama pivenukaduthunna jaipal reddy

భయమో, భక్తో, పారీ ్ట అధిష్టానం పట్ల ఉన్న అనురాగమో కాని తెలంగాణపై బహిరంగంగా మాట్లాడేందుకు కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి ఎంతమాత్రం ముందుకు రారు. నిజానికి ఆయన కేంద్రంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కేబినెట్ మంత్రి. సీనియర్ నేత. పార్టీ అధిష్ఠానంతో చాలా దగ్గరి సంబంధాలు కలిగి ఉన్న నాయకుడు. తెలంగాణ గడ్డమీద పుట్టి తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడేందుకు జంకుతుంటారు. ఇందుకు ప్రతిసారి ఆయన భారత ప్రభుత్వంలో బాధ్యత గల హోదాను చూపించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్ విషయంలో బహిరంగంగా మాట్లాడేందుకు ససేమిరా అంటారు.

మంత్రి పదవిలో ఉండి తాను ఒక ప్రాంతం కోసం మాట్లాడటం సమంజసం కాదంటుంటారు. తనపై తెలంగాణవాదుల నుంచి విమర్శలు వచ్చినప్పుడల్లా పదవికి రాజీనామా చేస్తే అధిష్టానం వద్ద, కేంద్ర సర్కార్‌లో తెలంగాణ గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరు, మంత్రిగా ఉంటూనే అంతర్గతంగా తెలంగాణ కోసం పోరాడుతాను, మీరు బహిర్గతంగా ఉద్యమించండి అని సలహాలు ఇస్తుంటారు.
గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడిగా పేరున్న జైపాల్‌డ్డికి సరికొత్త మంత్రికి ఉన్న సాహసం కూడా లేకపోవడం దురదృష్టకరమని చెప్పుకోవచ్చు. నిన్నగాక మొన్న కేంద్ర కేబినెట్‌లో సహచర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఆ హోదాతో సంబంధం లేకుండా తెలంగాణకు వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడారు.

అభివృద్ధిలో వెనుకబడిపోయారనే డిమాండ్‌తో తెలంగాణ అడగడం సమంజసం కాదని అన్నారు. ఇంతకంటే వెనుకబడ్డ గిరిజన ప్రాంతాలు కలిగిన ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయని, వాటితో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని రాజకీయ నేతలు ఇంతవరకు డిమాండ్ చేయలేదంటూ కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ పేర్కొనడాన్ని చూసైనా జైపాల్‌కు తెలంగాణ గుర్తుకు రాలేదా అని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ గడ్డమీద పుట్టిన బిడ్డగా తెలంగాణ గురించి మాట్లాడేందుకు మీకు అంత భయమెందుకు, మీరు గట్టిగా మాట్లాడితే కేంద్రంలో కదలిక వస్తుందని వారంటున్నారు.

సీనియర్ మంత్రిగా, అధిష్ఠానం వద్ద పలుకుబడి కలిగిన నేతగా, ప్రభావం చూపించే స్థాయిలో ఉన్నప్పటికీ తెలంగాణ కోసం జైపాల్ బహిరంగంగా ఏనాడు కూడా నోరు విప్పి గట్టిగా మాట్లాడకపోగా బాధ్యత గల హోదాలో ఉన్నానంటూ తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణకు ద్రోహం చేయడమేనని టీ వాదులు నిప్పులు చెరుగుతున్నారు. నిన్న కేబినెట్‌లో చేరిన సీమాంధ్ర మంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే కనీసం ఆ స్థాయిలో కూడా స్పందించకపోవడం దురదృష్టకరమని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కిషోర్ చంద్రదేవ్ మాట అలా ఉంటే.. సీమాంవూధకు చెందిన కేంద్ర సహాయ మంత్రులు దగ్గుబాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మి, మొన్నటివరకు మంత్రిగా పనిచేసిన సాయివూపతాప్ తదితరులు సమైక్యవాదం గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపిస్తున్న నేతల బృందాల సమావేశాలకు వెళ్ళి సమైక్యవాదానికి మద్దతు పలికారు.

మరి వారు కేంద్ర మంత్రులు కాదా? జైపాల్‌డ్డి ఒక్కరికే ఆ హద్దులు ఉన్నాయా? అని తెలంగాణ ప్రాంత నేతలు కొందరు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జైపాల్ మంత్రి పదవి కారణంగా తెలంగాణ విషయంలో వెనకడుగు వేయకుండా మిగతా మంత్రుల తరహాలోనే తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

అది ఆత్మవంచనే అవుతుంది:
కేంద్ర మంత్రి అయిన జైపాల్‌డ్డి సుదీర్ఘ అనుభవమున్న రాజకీయ నాయకుడిగా తన అభివూపాయాన్ని వ్యక్తపర్చాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మంత్రి అయినంత మాత్రాన తన అభివూపాయాలు చెప్పకపోవడం ఆత్మవంచనే. తెలంగాణకు సానుకూలంగా లేదా వ్యతిరేకంగా ఏదో ఒక అభివూపాయాన్ని వెల్లడించలేని దుస్థితిలో ఈ గొప్ప నాయకుడు ఉండటం దురదృష్టకరం.

- పీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయం



జైపాల్ ఒత్తిడి తెస్తే ఆ లోటు ఉండదు:
జైపాల్‌డ్డి మౌనంతో తెలంగాణ ప్రజలకు మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావం కలుగుతున్నది. ఒక సీనియర్ నేత, మంత్రిగా తెలంగాణపై బహిరంగంగా మాట్లాడటం ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ విషయంలో లోటు కనిపించదు. పురందేశ్వరి, పనబాక లక్ష్మి సమైక్యవాదంపై తమ అభివూపాయాలను బాహాటంగానే వ్యక్తం చేస్తున్నప్పుడు, జైపాల్‌డ్డి తెలంగాణపై మాట్లాడటానికి అభ్యంతరమెందుకు? యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ వద్దకు వెళ్ళి జైపాల్ గట్టిగా తెలంగాణ కోసం మాట్లాడితే ఫలితం ఉంటుంది. అంతర్గతంగా ఏది మాట్లాడినా ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు. బహిరంగంగా ప్రజల మధ్యకు రావాలి.

- జి.నిరంజన్ (తెలంగాణ కాంగ్రెస్ సారధ్య బృందం)



కావాల్సింది తెలంగాణ.. జైపాల్‌రెడ్డి రాజీనామా
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఏకైక కేబినేట్ మంత్రిగా ఉన్న జైపాల్‌డ్డి తక్షణం పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్రను పోషించాల్సిందే. జైపాల్‌డ్డి తనకు తానుగా ఆంక్షలు విధించుకోవడంలో అర్థం లేదు. కేంద్ర మంత్రి వైరిచర్ల కిషోర్‌చంవూదదేవ్ మన్యం సీమను అడుగుతున్నారు. మరో కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి మాత్రం తెలంగాణపై మాట మాట్లాడటం లేదు. కేంద్రమంవూతిగా తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న జైపాల్‌డ్డి తెలంగాణపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఉద్యమంలో కలిసి రావాలి.

- ప్రొఫెసర్ కోదండరాం



చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి:
తెలంగాణపై కేంద్రమంత్రి జైపాల్‌డ్డి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటికే 141 మంది ప్రజావూపతినిధులు పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేశారు. ఇటీవలే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కిషోర్‌చంవూదదేవ్ స్పష్టంగా మన్యసీమ కోరుతుండగా జైపాల్‌డ్డికి ఎందుకు పట్టడం లేదు? తెలంగాణ కోసం జైపాల్‌డ్డి రాజీనామా చేసి కేంద్రానికి బుద్ధి చెప్పాలి.

- టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్



బ్రహ్మానందడ్డి శిష్యుడి కథే:
కేంద్ర మంత్రి జైపాల్‌డ్డి తెలంగాణలో పుట్టి పెరిగి 17 ఏళ్లు ఎమ్మెల్యేగా, 20 ఏళ్లు ఎంపీగా ఉన్నాడు. కనీసం చివరి సమయంలో పుట్టిన గడ్డపై ప్రజల మనోభావాల కోరిక మేరకైనా ఆరాడపడటంలేదు. ఆయనకు తెలంగాణపై ప్రేమలేదు.1969లో సమైక్యవాది బ్రహ్మానందడ్డిశిష్యుడు. ఇప్పటికీ అదే ఒరవడి కొనసాగిస్తున్నాడు. ఆయన మొదట సమైక్యవాది.. ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకి. తరువాత అవకాశవాది. ఇప్పుడు సోనియా తరపున ఉన్నాడు. డిసెంబర్ 9 ప్రకటన ఒకసారి తాను చేయబట్టే వచ్చిందంటాడు. మరోసారి తనకు సంబంధం లేదంటాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన గిరిజన నేత కిషోర్ చంద్రదేవ్ కేంద్ర కేబినెట్‌లో ఉన్నా.. తన ప్రజల మనోభావాల మేరకు మాట్లాడుతున్నాడు. ఆ మేరకు కూడా జైపాల్‌డ్డి మాట్లాడటం లేదు. ఆయనకు తెలంగాణ రావాలని లేదు.

- టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్

No comments:

Post a Comment